
Delhi, Feb 23: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇవాళ దుబాయ్ వేదికగా హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. దాయాది దేశాలైన భారత్ తో తలపడనుంది పాకిస్థాన్(India Vs Pakistan). దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధింంచింది టీమిండియా. శుభ్‌మన్ గిల్ అద్భుత శతకంతో మెరియగా రోహిత్ శర్మ , కేఎల్ రాహుల్ రాణించారు.
ఇక రెండో మ్యాచ్ పాకిస్థాన్‌తో తలపడనుండగా ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత్ నేరుగా సెమీస్‌కు చేరనుంది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఫామ్‌లోకి వస్తే పాకిస్థాన్ బౌలర్లకు చుక్కలు కనిపించడం ఖాయం(Dubai International Cricket Stadium ).
దీనికి తోడు 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో భారత్‌ను ఓడించింది పాకిస్థాన్. ఈ మ్యాచ్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా ఆటగాళ్లు ఉవ్విళ్లూరుతున్నారు. ఇక ఓవరాల్‌గా భారత్ - పాకిస్తాన్ 135 వన్డే మ్యాచ్‌లలో తలపడగా భారత్ 57 మ్యాచ్‌ల్లో పాకిస్థాన్ 73 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. ఐదు మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ 3-2 తేడాతో భారత్ కంటే ఒక మ్యాచ్ ఎక్కువగా గెలిచింది9India vs Pakistan LIVE SCORE).
భారత్ vs పాకిస్తాన్ అంచనా జట్లు
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్/వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ.
పాకిస్తాన్: బాబర్ ఆజమ్, ఇమామ్-ఉల్-హక్, సౌద్ షకీల్, మోహమ్మద్ రిజ్వాన్ (కెప్టెన్ & వికెట్ కీపర్), సల్మాన్ అలీ ఆఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హారిస్ రౌఫ్, అబ్రార్ అహ్మద్.
రోహిత్ శర్మ ఫామ్‌పై సందేహం నెలకొన్న నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ .. రోహిత్‌కు మద్దతుగా నిలిచారు. రోహిత్ శర్మ ఫామ్‌లో ఉన్నా లేకపోయినా అతను భారత జట్టుకు అగ్రశ్రేణి మ్యాచ్ విన్నర్ అన్నారు. ఒకసారి రోహిత్ ఫామ్‌లోకి వస్తే 60 బంతుల్లోనే సెంచరీ చేయగలడు.. 145-150 కి.మీ వేగంతో బౌలింగ్ వచ్చినా హుక్ షాట్స్‌ను సునాయాసంగా ఆడగలరు, రోహిత్ ఒక్కడే మ్యాచ్ గెలిపించగలడు అని ప్రశంసలు గుప్పించారు యువీ.